Skip to main content

🕉తీర్థం యొక్క అర్ధం దాని పరమార్ధం ఏంటో తెలుసుకోండి🕉

ఉదకం చందనం చక్రమ్‌ శంఖంచ తులసీదళమ్‌॥
ఘంటాం పురుష సూక్తంచ తామ్రపాత్ర మథాష్టమమ్‌॥
సాలగ్రామ శిలాచైవ  నవభిస్తీర్థముచ్చతే

అంటే
ఉదకం, చందనం, చక్రం, శంఖం, తులసీదళం, ఘంట, పురుషసూక్తం, తామ్రపాత్ర, సాలగ్రామం - ఈ తొమ్మిదింటి కలయిక వల్ల ఏర్పడే ఉదకాన్నే ‘తీర్థం’ అంటారు.

అలాగే
భగవత్పాద తీర్థంతు నిత్యం యః పిబేత్‌నరః
ఆరోగ్యవాన్ సదా భూత్వాసాయుజ్యం లభతేమమ॥
సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం
సర్వరోగాది శమనం సర్వపాప హరంభవేత్‌॥

అంటే
భగవంతుడిని అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని, పరమేశ్వర సాయుజ్యాన్ని  పొందుతాడని, తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంధాలు చెప్తున్నాయి.  సాధారణంగా గుళ్ళలోని దేవతా విగ్రహాలని కడిగిన లేదా అభిషేకించిన జలాన్ని , పాలను  దేవాలయాలకి వచ్చిన భక్తులకి తీర్థంగా ఇస్తారు.  కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి, పచ్చకర్పూరం లాంటి  సుగంధ ద్రవ్యాలతో తయారుచేసిన తీర్థాన్ని దేవుడికి  నివేదన చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు.

భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు ‘అకాలమృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణుపాదోదకం లేదా శివపాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడు సార్లు పోస్తారు.  అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి. 

పరమాణుసమం తీర్థం
మహాపాతకనాశనం
తదైవాష్టగుణం  పాపం
తద్భూమౌ పతితాయాది॥

అన్నారు .. అంటే  పరమాణు సమానమైన తీర్థం మహాపాతకాలని సైతం నాశనం చెయ్యగలది.  అటువంటి తీర్ధం నేల మీద ఒక్క చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలని ఇస్తుందిట. 

వస్త్ర చతుర్గణీకృత్య పాణౌ పాణిం నిధామయ
పవిత్రం విష్ణు పాదామ్ము  త్రిః పిభేద్బిన్దు వర్జితమ్‌॥

ఎడమ అరచేతి కింద అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడిచేతిని పైన చెప్పిన విధంగా శంఖువు ఆకారంలో పెట్టుకుని  నేల మీద ఒక చుక్క కూడా క్రింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి. ముఖ్యంగా పూజారులు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకి అందించడం లాంటిది చెయ్యకూడదు.  అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదకం తీర్థం అని భక్తులతో పాటు అర్చకులు కూడా తెలుసుకోవాలి.

తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా  బొటన వేలు పైన చూపుడు వేలుని ఉంచుతాం.  అంటే బొటన వేలుని చూపుడు వేలుతో కొంచం నొక్కిపట్టి ఉంచుతాం.  అది ఒక విధంగా శంఖం ఆకారంలో కూడా కన్పిస్తుంది.  శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదన్నట్టు అప్పుడు అది శంఖంలో తీర్ధం పోసినట్టే అవుతుంది కదా !

అసలు తీర్ధం తీసుకునేటప్పుడు చూపుడు వేలుని, బొటన వేలుని అలా అమర్చి పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది.  అదేంటంటే.  హస్తసాముద్రికం ప్రకారం బొటన వేలు ఐహికమైన సుఖ భోగాలకి, మమకారవికారాలకి కారణం అయిన శుక్రుడిది , అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది.   అందువలన పవిత్రమైన, పాపహారణమైన ఆ తీర్ధాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంఛలని పోగొట్టుకోమ్మంటూ అవన్నీ  దైవసమాన మైన గురువు అనుగ్రహం, దీవెన ఉంటేనే పోతాయనే భావంతోనే గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బోటనవేలుని మడిచి నొక్కి పెడతారు.  తీర్ధం ఇవ్వడం పుచ్చుకోవడం వెనక ఇంత విషయం ఉంది !

   🙏🙏సర్వేజనా సుఖినోభవంతు 🙏🙏

Comments

Popular posts from this blog

Aditya Hrudayam - Telugu

తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ | రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || 1 || దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ | ఉపగమ్యా బ్రవీద్రామమ్ అగస్త్యో భగవాన్ ఋషిః || 2 || రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ | యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి || 3 || ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనమ్ | జయావహం జపేన్నిత్యమ్ అక్షయ్యం పరమం శివమ్ || 4 || సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనమ్ | చింతాశోక ప్రశమనమ్ ఆయుర్వర్ధన ముత్తమమ్ || 5 || రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ | పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || 6 || సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః | ఏష దేవాసుర గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || 7 || ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః | మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || 8 || పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః | వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః || 9 || ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ | సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః || 10 || హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ | తిమిరోన్మథనః శంభుః త్వష్టా మార్తాండకో‌உంశు...

Hanuman Chalisa - Telugu

  జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 || రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా || 2 || మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ||3 || కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 4 || హాథవజ్ర ఔ ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ సాజై || 5|| శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 6 || విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర || 7 || ప్రభు చరిత్ర సునివే కో రసియా | రామలఖన సీతా మన బసియా || 8|| సూక్ష్మ రూపధరి సియహి దిఖావా | వికట రూపధరి లంక జరావా || 9 || భీమ రూపధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే || 10 || లాయ సంజీవన లఖన జియాయే | శ్రీ రఘువీర హరషి ఉరలాయే || 11 || రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరతహి సమ భాయీ || 12 || సహస వదన తుమ్హరో యశగావై | అస కహి శ్రీపతి కంఠ లగావై || 13 || సనకాదిక బ్రహ్మాది మునీశా | నారద శారద సహిత అహీశా || 14 || యమ కుబేర దిగపాల జహాఁ తే | కవి కోవిద కహి సకే కహాఁ తే || 15 || తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా | రామ మిలాయ రాజపద దీన్హా || 16 || తుమ్హరో మంత్ర విభీషణ మానా | లంకేశ్వర భయ...

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమ్

ఓం ‖ అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, వశిన్యాది వాగ్దేవతా ఋషయః, అనుష్టుప్ ఛందః, శ్రీ లలితా పరాభట్టారికా మహా త్రిపుర సుందరీ దేవతా, ఐం బీజం, క్లీం శక్తిః, సౌః కీలకం, మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థే లలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్ర నామ జపే వినియోగః కరన్యాసః ఐం అంగుష్టాభ్యాం నమః, క్లీం తర్జనీభ్యాం నమః, సౌః మధ్యమాభ్యాం నమః, సౌః అనామికాభ్యాం నమః, క్లీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః అంగన్యాసః ఐం హృదయాయ నమః, క్లీం శిరసే స్వాహా, సౌః శిఖాయై వషట్, సౌః కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ వౌషట్, ఐం అస్త్రాయఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః ధ్యానం అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీమ్ ‖ 1 ‖ ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మ పత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసమద్ధేమపద్మాం వరాంగీమ్ | సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురసుతాం సర్వసంపత్-ప్రదాత్రీమ్ ‖ 2 ‖ సకుంకుమ విలేపనా మళికచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సశరచాప పాశాంకుశామ్ |...