షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం త్రిమూర్తి రూపా ఓ సాయి కరుణించి మము కాపాడోయి దరిశన మీయగ రావయ్యా ముక్తికి మార్గం చూపుమయా || షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో || కఫినీ వస్త్రము ధరియించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలలో ఫకీరు వేషపు ధారణలో కలియుగ మందున వెలసితివి త్యాగం, సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నీ వాసం భక్తుల మదిలో నీ రూపం || షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో || చాంద్ పాటిల్ ను కలుసుకొని ఆతని బాధను తెలుసుకొని గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము అచ్చెరు వొందెను ఆ గ్రామం చూసి వింతైనా దృశ్యం || షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో || బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫల మిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం || షిరిడీ వాసా సాయి ప్రభో జగతికి మూలం నీవె ప్రభో || నీ ద్వారములో నిలిచితిమి న...